బంగారం ధర నేడు కూడా మార్కెట్లో తగ్గుముఖం పట్టింది. దాదాపు నాలుగు రోజులుగా పెరుగుతూ ఉన్న బంగారం ధర నేడు మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది.పసిడి రేటు నేలచూపులు చూసింది. మరి బంగారం ధర తగ్గితే వెండి ధర ఎలా ఉంది మరి బంగారం వెండి ధరలు నేటి మార్కెట్లో చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.49,640కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా. రూ.240 తగ్గుదలతో రూ.45,500కి ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా తగ్గింది. వెండి రేటు ఈరోజు భారీగానే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. రూ.800 తగ్గింది కేజీ వెండి ధర రూ.76,500కు ట్రేడ్ అవుతోంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక వెండి బంగారం ధరలు వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.