ఫోన్​పేలో యూపీఐ లావాదేవీలు ఉచితమే..కానీ…

UPI transactions on phone pay are free..but ...

0
82

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలను పాపులర్ డిజిటల్ పేమెంట్ ప్లాట్​ఫాం ‘ఫోన్​పే’ ఖండించింది. తాము ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని  స్పష్టం చేసింది. ఎలాంటి యూపీఐ లావాదేవీ నిర్వహించినా..అది పూర్తిగా ఉచితమని పేర్కొంది.

అయితే, ఛార్జీల వసూలుపై కొంతమంది వినియోగదారులపై ప్రయోగం నిర్వహిస్తున్నట్లు ఫోన్​పే తెలిపింది. రూ.50 నుంచి రూ.100 మధ్య చెల్లింపులు చేస్తే ఒక రూపాయి, రూ.100 కన్నా ఎక్కువ చేసే చెల్లింపులకు రూ.రెండు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగం ప్రకారం రూ. 50 లోపు ఛార్జీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పుకొచ్చింది.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, వినియోగదారులకు రూ.50 క్యాష్​బ్యాక్ ఆఫర్​ను అందిస్తున్నట్లు ఫోన్​పే తెలిపింది. మూడుసార్లు రూ.51 లేదా అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసిన యూజర్లకు క్యాష్​బ్యాక్ వస్తుందని వెల్లడించింది. భారత్​లో ‘ఫోన్​పే’కు 32.5 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. దీంతో ఇది దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్​ఫాంలలో ఒకటిగా ఎదిగింది.