క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడుతున్నారా? ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..

0
115

క్రెడిట్‌, డెబిట్​ కార్డుల విషయంలో ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఆన్​లైన్​ పేమెంట్లు చేసే సమయంలో అక్రమాలకు తావు ఇవ్వకుండా టోకనైజేషన్​ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల కార్డు డేటాకు మరింత భద్రత ఉంటుందని తెలిపింది.అయితే ఈ నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

వాస్తవ కార్డు వివరాలకు ప్రత్యామ్నాయంగా ఒక విశిష్ఠ కోడ్‌ ఉంటుంది. దీనిని ‘టోకెన్‌’ అంటారు. ఈ టోకెన్‌లో ఎలాంటి గోప్యమైన సమాచారం ఉండదు. కేవలం కార్డుకి సంబంధించిన వివరాల గుర్తింపునకు ఇచ్చిన రిఫరెన్స్‌గా మాత్రమే పనిచేస్తుంది. ఇది అనుకోకుండా బహిర్గతమైనప్పటికీ.. ఎలాంటి ప్రమాదం ఉండదు.

చెల్లింపుల సమయంలో కార్డు వివరాలకు బదులు టోకెన్ వివరాలను అందజేస్తే సరిపోతుంది. ఆ రిఫరెన్స్‌ ద్వారా కార్డు వివరాలను సరిచూసుకొని లావాదేవీని పూర్తి చేస్తుంది. ఇక్కడ వ్యాపారి వద్ద కార్డుకి సంబంధించిన ఎలాంటి వివరాలూ స్టోర్ కావు గనక మోసాలకు తావుండదు.