వాట్సాప్‌ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్..

Using WhatsApp? But good news for you ..

0
94

ప్రస్తుతం వాట్సాప్‌ మన జీవితాల్లో భాగం అయిపోయింది. వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ వినియోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు.

ఇక వాట్సాప్‌ భారతదేశంలో తన చెల్లింపుల సేవలను మరింతగా మెరుగుపరుస్తోంది. చెల్లింపులు చేసే వినియోగదారుల సంఖ్య 40 మిలియన్ల వరకు పెంచుకోవడానికి రెగ్యులేటరీ ఆమోదం పొందిందని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే భారతదేశంలో తన చెల్లింపుల సేవను ఉపయోగించే వినియోగదారులపై ఎటువంటి పరిమితి ఉండకూడదని కంపెనీ అభ్యర్థించింది.

ప్రస్తుతం 20 మిలియన్లకు పరిమితం మాత్రమే ఉండగా, దానిని 40 మిలియన్లకు పెంచుకోవచ్చని అనుమతులు లభించాయి. ఇక భారతదేశంలో డిజిటల్‌ మార్కెట్లో గూగుల్‌పే, ఫోన్‌ పే, పేటీఎం, వాల్‌మార్కట్‌, ఇతర డిజిటల్‌ యాప్‌లతో వాట్సాప్‌ పోటీ పడుతుంది. చెల్లింపులకు సంబంధించిన మొత్తం డేటాను స్థానికంగా నిల్వ చేయాల్సిన డేటా స్టోరేజీ నిబంధనలతో సహా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా ఈ ఆమోదం లభించింది.