బంగారంతో వడపావ్ – మరి దీని రేటు ఎంతో తెలిస్తే వారెవ్వా అంటారు

Vadapav with gold

0
89

వడాపావ్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఎంతో మందికి మంచి ఫేవరేట్ ఫుడ్ అనే చెప్పాలి. ఇక ముంబై దిల్లిలో ఈ వడపావ్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. చాలా మంది ఈ వ్యాపారం చేస్తున్నారు. అయితే మనం వందల రూపాయలు వేల రూపాయల వడపావ్ లు చూసి ఉంటాం వాటికి ఆ స్పెషాలిటీ ఉంది. అయితే తాజాగా ఓ గోల్డెన్ వడాపావ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ మరి ఇంతకీ ఆ వడపావ్ ఏమిటి అనేది చూద్దాం.

దుబాయ్ ఇక్కడ ఉండే సౌకర్యాలు విలాసవంతమైన జీవితం గురించి తెలిసిందే. ఇక్కడ చాలా మంది ధనవంతులు అన్నీ బంగారంతో చేయించిన వస్తువులు వాడతారు అనేది మనం విన్నాం. అయితే గోల్డెన్ బిర్యానీ గోల్డెన్ బర్గర్లు ఇవన్నీ కూడా అక్కడ తయారు చేసిన రెస్టారెంట్లు చూశాం.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 22 క్యారెట్ల బంగారు వడాపావ్ని పరిచయం చేసింది. కరమాలో ఓ పావో అనే సంస్థ ఈ రిచ్ పావ్ని ప్రవేశపెట్టింది. దీని ధర 99 దిర్హామ్ అంటే మన కరెన్సీలో సుమారు రూ. 2 వేలు చాలా మంది దీనిని టేస్ట్ చేస్తున్నారు
ఈ గోల్డెన్ వడాపావ్ని చిన్న చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. మరి రిచ్ కాబట్టి అంతే రిచ్ లుక్ ఉండాలి అని ఇలా ఇస్తున్నారు.
ఇంతకీ దీనిని ఫ్రెంచ్ నుండి ఇంపోర్ట్ చేసిన 22 క్యారెట్ గోల్డ్ లీవ్స్తో సూపర్ గా తయారు చేస్తున్నారు.

మరి మీరు ఈ వీడియో పై లుక్కేయండి
https://twitter.com/i/status/1432357846788739076