- ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్స్ తీసుకొస్తుంది. తాజాగా ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆన్లైన్లో ఉంటే.. ప్రస్తుతం మామూలు కాల్స్ కంటే వాట్సాప్ కాల్స్‌కే ప్రాధాన్యం ఇస్తోంది యువత. అయితే.. వాట్సాప్ వాయిస్ కాల్స్‌ను.. నార్మల్ కాల్స్‌లా రికార్డు చేయడం చాలా మందికి తెలియదు. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ కాల్స్ లో మనం మాట్లాడే మాటలు తప్ప అవతలి వారి మాటలు రికార్డు కావు. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘క్యూబ్ ఏసీఆర్’ అనే కాల్ రికార్డర్ యాప్‌తో తేలికగానే సాధించొచ్చు. ఇది వాట్సాప్ వాయిస్ కాల్స్‌ను రికార్డు చేసి ఫోన్ స్టోరేజీలో సేవ్ చేస్తుంది. అయితే అవతలి వ్యక్తుల అనుమతి లేకుండా వారి మాటలను రికార్డు చేయటం తగదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే వాట్సాప్ కాల్స్‌ను రికార్డు చేసే ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండకపోవచ్చు.
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్యూబ్ ఏసీఆర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఈ యాప్‌ను ఓపెన్ చేసి అలాగే రన్ అవుతుండేలా చూడాలి.
వాట్సప్‌ను ఓపెన్ చేసి వాయిస్ కాల్ చేయాలి.
ఒకవేళ క్యూబ్ ఏసీఆర్ దానంతటదే రికార్డు చేయటం మొదలెట్టకపోతే, ఆ యాప్‌ను ఓపెన్ చేసి ‘ఫోర్స్ వీఓఐపీ కాల్ యాజ్ వాయిస్ కాల్’ ఎంచుకోవాలి. తర్వాత వాట్సప్ కాల్‌ను మళ్లీ చేయాలి.