దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూర ఏదైనా టమాటా తప్పనిసరి కావడంతో అది కొనకుండా, దానిని వాడకుండా వంట కార్యక్రమం పూర్తి కావడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా పంట దారుణంగా దెబ్బతింది.
మరీ ముఖ్యంగా టమాటా ఎక్కువగా సరఫరా అయ్యే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు పంటను దారుణంగా దెబ్బతీశాయి. దీంతో ఒక్కసారిగా సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరిగిపోయింది. కోల్కతాలో కిలో టమాటా ధర రూ. 93కు చేరుకోగా, చెన్నైలో రూ.60, ఢిల్లీలో రూ59, ముంబైలో రూ53గా ఉంది. మరో 50 నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దాదాపు ప్రతి చోట కిలో టమాటా ధర రూ. 50 దాటేసింది. హైదరాబాద్లో కిలో రూ. 70-80 మధ్య పలుకుతోంది. దీనితో టమాట కొనుక్కొని తినే పరిస్థితి లేదు.