వాట్సాప్​ మరో అప్​డేట్..ఇకపై 7 రోజులు కాదు.. 24 గంటలే!

WhatsApp another update..not 7 days anymore .. only 24 hours!

0
95

వాట్సాప్​ మరో అప్​డేట్​తో రానుంది. ఇప్పటికే ఉన్న డిస్అప్పీయరింగ్​ ఫీచర్​కు తుది మెరుగులు దిద్దింది. సాధారణంగా 7 రోజులకు ఆటోమేటిక్​గా డిలీట్​ అయ్యే మెసేజ్​లు కొత్త అప్​డేట్​తో 24 గంటల్లోనే కనిపించకుండా పోనున్నాయి.

దిగ్గజ మెసెంజర్​ వాట్సాప్​.. ఎప్పటికప్పుడు యాప్​ను అప్​డేట్​ చేస్తూ వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో మరో అప్​డేట్​​ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే వాట్సాప్​లో ఉన్న డిసప్పీయరింగ్​​​ ఫీచర్​కు మరిన్ని మెరుగులు దిద్దింది. ఇప్పటి వరకు కేవలం నిర్ణీత కాల వ్యవధితో మాత్రమే మెసేజ్​లు అటోమేటిక్​గా డిలీట్​ అయ్యేవి. అయితే వాట్సాప్​ త్వరలో తీసుకురానున్న ఫీచర్​తో వాటి కాల వ్యవధి మరింత కుదించడంతో పాటు పొడిగించనుందని ‘ది వర్జ్’​ అనే సంస్థ తెలిపింది.

వాట్సాప్​లో మెసేజ్​లు ఆటోమేటిక్​ డిలీట్ అవ్వాలి అంటే..యూజర్, కాంటాక్ట్​ లేదా గ్రూప్​ ఇన్​ఫోలోకి వెళ్లి డిసప్పీయరింగ్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి. ఇలా చేస్తే మెసేజ్​లు 7 రోజుల తరువాత ఆటోమేటిక్​గా డిలీట్​ అవుతాయి. అయితే వాట్సాప్​ తాజాగా తీసుకువస్తున్న ఫీచర్​తో ఆ 7 రోజులుగా ఉన్న ఆప్షన్​ను​ 24 గంటలకు కుదించుకోవడంతో పాటు 90 రోజుల వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎంచుకున్న సమయం తర్వాత మెసేజ్​లు ఆటోమేటిక్​గా డిసప్పీయర్​ అయ్యేలా వీలు కల్పించింది. దీనికోసం యూజర్స్ డిసప్పీయరింగ్​ ఆప్షన్​ను క్లిక్​ చేస్తే వచ్చే ఈ మూడు ఆప్షన్స్​లో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి.