మళ్లీ వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టా సేవలకు అంతరాయం

0
82
BELGRADE - APRIL 26, 2014 Popular social media icons Facebook, Whatsapp and other on smart phone screen close up; Shutterstock ID 189356834

ప్రముఖ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్​, ఫేస్​బుక్, ఇన్​స్టా​ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఇలా జరగడం వారంలో ఇది రెండోసారి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల..కొంత సమయం పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

ఇలా జరగడంపై ఇన్​స్టాగ్రామ్​ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అంతరాయంపై క్షమాపణలు చెప్పింది.

ఇలానే సోమవారం రాత్రి 9 గంటల తర్వాత..వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల.. కొన్ని గంటల పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దాదాపు 7 గంటల తర్వాత వాట్సాప్‌ సేవలు పునరుద్ధరించారు.