వాట్సాప్‌ మరో అద్భుతమైన ఫీచర్‌..ఇకపై గ్రూప్‌ అడ్మిన్లకు ఆ అధికారం..!

WhatsApp is another amazing feature..and that power to group admins anymore ..!

0
101

వాట్సాప్‌ లేని స్మార్ట్ ఫోన్ లేదనడంలో అతిశయోక్తి లేదు. అంతలా మన జీవితంలో భాగం అయిపోయింది వాట్సప్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకువస్తుంది కాబట్టే దీనికి ఇంతలా డిమాండ్‌ ఏర్పడింది.

ఇక ఫేక్‌ కంటెంట్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో వాట్సాప్‌ ఇప్పటికే పలు ఫీచర్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ దిశగా వాట్సాప్‌ మరో అడుగు ముందుకేసింది. ముఖ్యంగా వాట్సాప్‌ గ్రూప్‌లలో ఎవరు పడితే వారు ఏది పడితే అది పోస్ట్‌ చేసే అవకాశం ఉంది. అయితే ఇకపై గ్రూప్‌ అడ్మిన్‌ ఆ పోస్టులను కంట్రోల్‌ చేసే అధికారం రానుంది. అవును మీరు చదివింది నిజమే.. ఇకపై గ్రూప్‌ సభ్యులు చేసిన పోస్టులను గ్రూప్‌ అడ్మిన్‌ తొలగించవచ్చు.

ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసిన టెక్ట్స్‌, ఫొటో, వీడియో వంటి కంటెంట్‌ను ఇకపై గ్రూప్‌ అడ్మిన్‌లు నియంత్రించవచ్చు. ఒకవేళ అభ్యంతరకరమైన మెసేజ్‌లను గ్రూప్‌ అడ్మిన్‌ డిలీట్ చేసే అవకాశం రానుంది.

ఇలా చేస్తే.. గ్రూప్‌ చాట్ పేజీలో ‘గ్రూప్‌ అడ్మిన్‌ తొలగించారు’ అనే మెసేజ్‌ కనిపిస్తుంది. ఒకరికి మించి ఎక్కువ మంది అడ్మిన్‌లు ఉన్నా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇదిలా ఉంటే వీటితో పాటు వాట్సాప్‌ ప్లేయర్‌, ఆడియో మెసేజ్‌ ప్రివ్యూ, కమ్యూనిటీ వంటి మరికొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు త్వరలోనే అందించనుంది.