వాట్సాప్ కొత్త ఫీచర్..ఆ సమయాన్ని పెంచుతారటా..!

Whatsapp new feature .. will increase that time ..!

0
90

వాట్సాప్ ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‎ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. వాట్సాప్‎లో మెసేజ్ డిలీట్ ఫీచర్‎ను 2017లో ప్రవేశపెట్టారు. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ కాలపరిమితి ఏడు నిమిషాలుగా నిర్ణయించారు. కొన్ని నెలల తర్వాత గంటకు పైగా పెంచారు. అంటే మనం వాట్సాప్‎లో ఏదైనా అనుకోకుండా మెసేజ్ పెట్టామనుకోండి. దాన్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అప్షన్ క్లిక్ చేస్తే ఆ మెసేజ్ అందరి వాట్సాప్‎లో డిలీట్ అవుతుంది. దీంతో యూజర్స్ మెసేజ్‌ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్‌తోపాటు అవతలి వ్యక్తుల చాట్‌ పేజ్‌ నుంచి సదరు మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు.

ప్రస్తుతం మెసేజ్‌ పంపిన గంటలోపు మాత్రమే ఇరువురి చాట్ పేజ్‌ నుంచి మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు. గంట దాటితే పంపిన వ్యక్తి పేజ్‌ నుంచి మాత్రమే డిలీట్ అవుతుంది. త్వరలో తీసుకొస్తున్న ఫీచర్‌తో నెల రోజుల తర్వాత కూడా యూజర్‌ తాను పంపిన మెసేజ్‌ని ఛాట్ పేజ్‌ నుంచి డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.

వాట్సాప్‌ 2017లో డిలీట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. అప్పట్లో మెసేజ్‌ డిలీట్ టైమ్‌ లిమిట్ 7 నిమిషాలుగా ఉండేది. తర్వాత మూడు కొత్త టైమ్‌ లిమిట్‌లను పరిచయం చేసింది. అవి గంట, 8 నిమిషాలు, 16 సెకన్లు. అంటే యూజర్‌ మెసేజ్‌ పంపిన తర్వాత అందులో ఏవైనా తప్పులుంటే పైన పేర్కొన్న కాలపరిమితిలోపు వాటిని డిలీట్ చేస్తే అవతలివారు వాటిని చూడలేరు. అలానే వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

వాబీటాఇన్ఫో తెలిపిన దాని ప్రకారం వాట్సాప్‌ కొత్తగా వీడియో ప్లేబ్యాక్ ఇంటర్‌ఫేస్‌ను తీసుకొస్తుందట. ఇందులో యూట్యూబ్‌ లింక్‌లు వాట్సాప్‌లో షేర్ చేసినప్పడు వాటిని పాజ్‌ చేయడంతో పాటు పూర్తి స్క్రీన్‌లో వీడియోను ప్లే చేసేలా దీన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ట్రయల్స్‌ కోసం గత నెలలో ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌కి ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. తాజాగా ఐఓఎస్‌ బీటా యూజర్స్‌ కూడా ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చని వాబీటాఇన్ఫో తన కథనంలో పేర్కొంది.