వాట్సాప్‌ సంచలన నిర్ణయం..17.5 లక్షల అకౌంట్లు బ్యాన్‌!

0
119

వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ లేదనడంలో అతిశయోక్తి లేదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోని మునిగి తేలుతుంటారు చాలా మంది. ఇంకా వాట్సాప్‌ గ్రూపులతో ఎంతో మంది ఉద్యోగ రీత్యా, ఆన్ లైన్ క్లాసులతో బిజీగా గడుపుతున్నారు.

ఈ రోజుల్లో వాట్సాప్‌ అంటేనే ఒక వ్యసనంగా మారిపోయింది. ఇక తాజాగా వాట్సాప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 2021లో 17.5 లక్షలకుపై వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసినట్లు కంప్లియెన్స్‌ రిపోర్టులో వెల్లడించింది. వాట్సాప్‌ తాజాగా సమర్పించిన రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న భారత్‌ ఖాతాలను +91 ఫోన్‌ నెంబర్‌ ద్వారా గుర్తించినట్లు తెలిపింది. ఐటీ నిబంధనల ప్రకారం.. గత ఏడాది నవంబర్‌ నెలకు సంబంధించిన రిపోర్టును ప్రకటించామని వాట్సాప్ తెలిపింది.

నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి అకౌంట్లను గుర్తించి అకౌంట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అలాగే కొంత మంది యూజర్లపై వాట్సాప్‌ సొంతంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వాట్సాప్‌ను సురక్షితంగా ఉంచేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా 40 కోట్లకుపై వాట్సాప్ యూజర్లు ఉన్నారు. రద్దు అయిన అకౌంట్ల ద్వారా యూజర్లు బల్క్‌ మెసేజ్‌లు పుంపుతున్నట్లు గుర్తించామని వాట్సాప్‌ తెలిపింది. గత ఏడాది మే నెల నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాట్సాప్‌ అకౌంట్లపై చర్యలు చేపట్టింది సంస్థ.