వారంలో 3 రోజులు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ – ఈ కంపెనీ కీలక నిర్ణయం

Work from home for employees 3 days a week-This is a key decision for the company

0
108

2020 మార్చి నుంచి ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభించిందో తెలిసిందే. ప్రపంచంలో ప్రతీ దేశం ఈ కరోనాతో ఇబ్బంది పడింది. ఇక ఈ కరోనా కేసులు పెరగడంతో పెద్ద ఎత్తున కంపెనీలు ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అంతేకాదు వారికి అనేక సౌకర్యాలు కల్పించాయి.

తాజాగా ఉద్యోగుల భద్రత కోసం టెలికాం కంపెనీ నోకియా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఉద్యోగులు తమ సౌలభ్యం మేరకు అవసరమైతే వారానికి మూడు రోజులు ఇంటి నుంచే పని చేయవచ్చని తెలిపింది. కంపెనీ కొత్త విధానం తెలిపింది. మొబైల్ ఫోన్లు వచ్చిన సమయంలో ప్రతీ ఒక్కరు ముందు రోజుల్లో నొకియా బేసిక్ ఫోన్లు వాడేవారు. ప్రపంచంలో అత్యధిక సేల్స్ కూడా నోకియా మొబైల్స్ అనేది తెలిసిందే.

130 దేశాలకు విస్తరించిన నోకియాలో మొత్తం 92 వేల మంది ఉద్యోగులు ఇప్పుడు పనిచేస్తున్నారు. టీం వర్క్కు ప్రాధాన్యవిచ్చేలా సంస్థ తన కార్యాలయాలను తాజాగా రీడిజైన్ చేస్తోంది. మొత్తానికి తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకి చాలా మంచి నిర్ణయం అంటున్నారు టెక్ నిపుణులు.