వాషింగ్టన్: భారత్‌లో కరోనా సంక్షోభంలో ఇబ్బందులు ఎదుర్కోంటున్న ఎమ్‌ఎస్‌ఎంఈ రంగానికి చేయూత ఇవ్వడం కోసం ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. భారత్‌కు 500 మిలియన్ డాలర్లు(రూ. 3,640కోట్లు) ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సాయాన్ని ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి ఖర్చు చేయాలని ప్రపంచబ్యాంక్ సూచించింది.
కరోనాతో ఆర్ఢికంగా చితికి పోయిన భారతీయ కంపెనీలకు ఈ ప్రకటన శుభవార్తే అంటున్నారు వ్యాపార వేత్తలు.