డమ్మి ఉరికి రెడీ – తలారి పవన్ జల్లాద్ – కొన్ని గంటలు మాత్రమే

డమ్మి ఉరికి రెడీ - తలారి పవన్ జల్లాద్ - కొన్ని గంటలు మాత్రమే

0
127

అమ్మాయిని అత్యంత దారుణంగా చంపిన ఆ నలుగురి కోసం ఉరి ఎదురుచూస్తోంది.. ఇక మరో 24 గంటలు మాత్రమే వారికి బతికే ఛాన్స్… యావత్ దేశం కోరుకున్న ఏడేళ్ల కల రేపు నెరవేరబోతోంది. నిర్భయ అత్యాచార ఘటనలో దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సమయంలో నలుగురు దోషులు తప్పించుకునేందుకు పిటీషన్లతో కోర్టుకు వెళుతున్నారు, కాని ఆ పిటిషన్లు అన్నీ కోర్టు కొట్టివేస్తోంది, ఇప్పటికే ఉరి జాప్యం అయింది.. మరోసారి తప్పించుకునేందుకు వారు వేస్తున్న ఎత్తుగడలు కోర్టు కూడా గుర్తిస్తోంది.

ఇక ఈ నలుగురు దోషులను ఉరితీసే తలారి పవన్ జల్లాద్ మీరట్ నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు నిన్న చేరుకున్నారు. పవన్ జల్లాద్ నేడు ఉరితాడు, ఉరికంబం సామర్థ్యాలను పరీక్షించనున్నారు. జైలు అధికారుల సమక్షంలో డమ్మీ ఉరి నిర్వహించనున్నారు. తలారి పవన్ జల్లాద్ కు తీహార్ జైలు ప్రాంగణంలోనే ప్రత్యేకంగా బస ఏర్పాటు చేశారు, నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు.