మన దేశంలో సైన్స్ ని నమ్మేవాళ్ల కంటే ఇలా మూఢనమ్మకాల్ని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఇలా మూఢనమ్మకాలతో ప్రాణాలు పొగొట్టుకున్న వారు ఉన్నారు.కోవిడ్ పోవాలంటూ గతంలో వివిధ రకాలుగా పూజలు చేసిన వారిని చూశాం. కానీ ఏకంగా కరోనా మాత గుడిని కట్టేశారు.
ఇదే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది.ఉత్తర్ ప్రదేశ్లో ఏకంగా ఓ దేవాలయాన్ని కట్టి పూజలు చేస్తున్నారు. ప్రతాప్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో చెట్టు కింద కరోనా మాత గుడిని ఏర్పాటు చేసి ఈ గుడికి వచ్చి నిత్యం కరోనా మాతకి పూజలు చేస్తున్నారు.
కరోనా శాంతించాలని కోరుతున్నారు. ఆ గుడిలో కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. కరోనా దేవతకు మాస్క్ పెట్టారు, ఈ పూజల కోసం ఓ పూజారీని పెట్టారు. విచిత్రం ఏమిటంటే, ఇలా పూజలు చేసినా కొందరికి కరోనా వచ్చిందట.