పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు..10 మందికి గాయాలు

0
103

ఏపీలో ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే..గుడివాడ నుండి విజయవాడ వెళ్తున్న బస్సు అదుపుతప్పి కలపాముల వద్ద పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను 108 ద్వారా గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొంత మంది క్షతగాత్రులను ఉయ్యూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.