జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

-

Jammu Kashmir |జమ్ముకశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి కొంత మంది యాత్రికులు జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) లోని మాతా వైష్ణో దేవి ఆలయ దర్శనానికి బయలుదేరారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై కరుబూర్ దగ్గర వంతెన పైనుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా మరో 55 మంది గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 75 మంది ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరి కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Read Also:
1. బుల్లెట్లు దింపుతా.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
2. యోగి ఆదిత్యనాథ్ పాలనలోనే ఇది సాధ్యం..!!
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kartik Aaryan | ‘మద్దతు లేదు.. నాది ఒంటరి పోరాటమే’

ఇండస్ట్రీలో తాను చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నానని చెప్పాడు బాలీవుడ్ యంగ్ హీరో...

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...