Tamilnadu: చిన్నారి మృతదేహం నుంచి తలను తీసుకువెళ్లి…?

-

Tamilnadu: కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే.. మనుషులు మళ్లీ రాతియుగం వైపు మళ్లితున్నారేమో అనిపించక మానదు. ఓ పక్క సైన్స్, టెక్నాలజీ అంటూ ప్రపంచం ముందుకు వెళ్తుంటే, కొందరు ఇంకా మూఢాచారాలను నమ్మి ఘోరమైన పనులు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకా తిత్తరవాడి గ్రామంలో పాండియన్‌ కుటుంబంతో ఉంటున్నాడు. పాండియన్‌ కమార్తె కృత్తిక (12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. ఈ నెల 5న అవురిమేడు గ్రామంలో ఉంటున్న తన అవ్వ దగ్గరకు కృత్తిక వెళ్లింది. అక్కడ పిల్లలతో ఆనందంగా ఆడుకుంటున్న కృత్తికపై అక్కడే ఉన్న విద్యుత్తు స్తంభం విరిగి పడటంతో, తీవ్ర గాయాలపాలయ్యింది. ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. చికత్స పొందుతూ కృత్తిక కన్నుమూసింది. కాగా, మృతదేహాన్ని శ్మశానంలో ఖననం చేశారు. ఈ నెల 25న అమావాస్య నాడు రాత్రి, కృత్తికను ఖననం చేసిన చోట కొందరు క్షుద్రపూజలు చేసి, బాలిక మృతదేహం నుంచి తలను ఖండించి తీసుకువెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా వైరల్‌గా మారింది.

- Advertisement -

Read also: జగన్ తో భేటీ..బిగ్ బాంబ్ పేల్చిన ఆర్జీవీ!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...