ఈ కూతురు తల్లిదండ్రులని ఎలా బెదిరించిందో తెలిస్తే షాక్ అవుతారు

0
108

మీ పిల్లలు మీకు దక్కాలి అంటే చెప్పిన డబ్బు పంపాలి అనే మెసేజ్ వస్తే త‌ల్లిదండ్రుల గుండెలు అదిరిపోతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కాని మెసేజ్ చేసిన వారు ఎవరో తెలిసి షాక్ అయ్యారు ఆ కుటుంబ సభ్యులు.

కోటి రూపాయలు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావంటూ తన తండ్రికి మెసేజ్ పంపింది 11 ఏళ్ల బాలిక. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్, శాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఆ అమ్మాయిని తల్లిదండ్రులు మందలించారు. అందుకే తల్లిదండ్రులని భయపెట్టాలి అని అనుకుంది. ఆ ప్లాన్ లో భాగంగా తండ్రి ల్యాప్ ట్యాప్ తీసుకుని దాని నుంచే ఆయనకు మెసేజ్ పంపింది.

కోటి రూపాయలు ఇవ్వాలి లేదంటే కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరించింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆ మెసేజ్ ఎక్కడ నుంచి వచ్చిందా అనేది చూస్తే ఇంట్లో నుంచి వచ్చింది అని తేలింది. ఇక పోలీసులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఆ పేరెంట్స్ మాత్రం షాకయ్యారు.