సారీ అమ్మా క్షమించు – గేమ్ కోసం నగదు వాడిన బాలుడు… చివరకు

0
84

చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో ఆన్ లైన్ గేమ్ లకి బాగా అలవాటు పడుతున్నారు. అయితే నగదు చెల్లించి తర్వాత లెవల్స్ చేరుకోవాలని కొందరు ఏకంగా ఇంట్లో నగదు ఖర్చు చేస్తున్నారు. ఆ మొబైల్ కి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ల నుంచి నగదు వాడుతున్నారు. తల్లిదండ్రులకి తెలిసేసరికి ఈ నగదు ఖర్చు చేస్తున్నారు.

ఇక ఖాతాలు చూస్తే జీరో బ్యాలెన్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం.
కాని ఇక్కడ ఓ విషాదకర ఘటన జరిగింది. ఆన్ లైన్ మొబైల్ గేమింగ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గేమ్ ఆడుతూ రూ.40 వేలు పోగొట్టుకున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలోని శాంతినగర్ లో ఫ్రీ ఫైర్ ఆన్ లైన్ గేమ్ ను ఆడాడు బాలుడు.

నిన్న తన తల్లి ఖాతాలోంచి రూ.1,500ను వాడుకున్నాడు. ఆమె మెసేజ్ చూసి ఇలా ఎందుకు ఖర్చు చేశావని మందలించింది. చివరకు రూమ్ కు వెళ్లి బెడ్ రూమ్ లో ఉరి వేసుకున్నాడు. మొత్తం రూ.40 వేలు ఖాతా నుంచి తీసినట్టు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.