బాలికపై 13 మంది సామూహిక అత్యాచారం..కోర్టు సంచలన తీర్పు

15-year-old girl gang-raped for nine days

0
124

రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన దారుణాలను పూర్తిగా రూపుమాపలేకపోతున్నారు. చట్టంలో మార్పులు తెచ్చి కఠిన శిక్షలు వేసిన ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

ఈ ఏడాది మార్చి 6న కోటా జిల్లాలోని సుకేత్‌ పోలీస్‌ స్టేషన్‌లో 15 ఏండ్ల బాలిక అత్యాచారం కేసు నమోదయింది. పూజా జైన్‌ అనే మహిళ.. ఆ బాలికను ఇంటి నుంచి అపహరించి, ఫిబ్రవరి 25న ఝలావర్‌లో విక్రయించింది. అనంతరం ఆ బాలికను యువకులు కొనుగోలు చేశారు. ఝలావర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై తొమ్మిది రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

ఆ బాలికపై తొమ్మిది రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన 13 మందికి రాజస్థాన్‌ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విదించింది. మరో ఇద్దరిని నాలుగేండ్లపాటు ఖైదు చేసింది. పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తంగా 16 మందికి కోర్టు శిక్ష విధించింది. మరో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. బాలికను విక్రయించిన మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 20 ఏండ్లు జైలుశిక్ష పడిన ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించింది. నాలుగేళ్లు శిక్ష పడిన వారు రూ.7 వేలు కట్టాలని ఆదేశించింది.