బ్యాంకు అధికారులమంటూ నయా మోసం..16 మంది అరెస్ట్

16 arrested for fraudulent bank officials

0
94

హైదరాబాద్‌: బ్యాంకు అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు పట్టుకున్నారు. దిల్లీలోని కాల్‌సెంటర్‌పై దాడి చేసి 16 మందిని అరెస్టు చేశారు. అక్కడి పోలీసుల సాయంతో నిందితులును అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంక్‌ అధికారులమంటూ పలువురి ఖాతాల నుంచి రూ.3 కోట్లు కాజేసినట్లు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో దిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం కాల్‌ సెంటర్‌పై దాడి చేసింది. 16 మంది పట్టుకోగా మరో ఏడుగురు పరారయ్యారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.