బంగాల్లోని నదియా జిల్లా హన్స్ఖలీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతి చెందిన ఓ మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె మృతదేహంతో సహా వ్యాన్లో బయలుదేరారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఓ ట్రక్కును వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దట్టమైన పొగమంచు ఉండటం సహా అతివేగం ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది దుర్మరణం
17 killed in road accident