Flash- ఘోర రోడ్డు ప్రమాదం..ఢీకొన్న 2 బస్సులు, 3 కార్లు

0
78

తెలంగాణ: హైదరాబాద్ లోని సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీఎన్‌రెడ్డి వద్ద బ్రేకులు ఫెయిలై ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును మరో బస్సు ఢీకొట్టింది. దీనితో ముందు బస్సు మరో కారును ఢీకొట్టింది. మొత్తం 2 బస్సులు, 3 కార్లు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.