పాకిస్థాన్ ను వణికించిన భూకంపం..20 మంది మృతి

0
87

పాకిస్థాన్‌ ను భారీ భూకంపం వణికించింది. ప్రజలు మంచి నిద్రలో ఉన్న సమయంలో దక్షిణ పాకిస్థాన్‌లో గురువారం ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చాలామంది భవనం పైకప్పు, గోడలు కూలి మీదపడడం వల్లే మరణించారు.

రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైందని అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళ సహా ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లను పంపిస్తున్నట్టు ప్రావిన్షియల్ సీనియర్ అధికారి సుహైల్ అన్వర్ హష్మి తెలిపారు.