బ్రేకింగ్ – స్పా సెంట‌ర్ ముగుసులో వ్య‌భిచారం 20 మంది అరెస్టు

20 members arrested for prostitution at spa center

0
80

న‌గ‌రంలో కొంత మంది స్పా బ్యూటీపార్ల‌ర్ల ముసుగులో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. వీరిపై స‌మాచారం రావ‌డంతో అక్క‌డ దాడి చేసి వారిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. తాజాగా
హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పరిధిలో సెలూన్,స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార దందాలను పోలీసులు బట్టబయలుచేశారు. ఇక్క‌డ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

వెంట‌నే స్పాపై దాడులు చేసిన పోలీసులు అక్క‌డ వారిని అరెస్ట్ చేశారు. అక్క‌డ మ‌సాజ్ పేరుతో ఇలా వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు నిర్వాహ‌కులు. ఆదివారం సాయంత్రం ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. స్పా సెంటర్‌, బ్యూటీ సెలూన్‌ ముసుగులో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్టు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులు, 10 మంది యువతులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
నిందితుల ద‌గ్గ‌ర 73 వేల క్యాష్ 28 మొబైల్స్ ఓ కారు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ దందా నడుపుతున్నట్లు తేలింది.