ప్రేమ అనేది అనిర్వచనీయమైన ఓ మధురానుభూతి. అయితే నేటి కాలంలో స్వచ్ఛమైన ప్రేమ భూతద్దం వేసి వెతికినా కానరావడం లేదు. ఒకరిని ప్రేమిస్తూనే మరొకరి ప్రేమ కోసం తపిస్తున్నారు ప్రస్తుత యువత. కొన్నిసార్లు ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఇలాంటి డబుల్ యాంగిల్ లవ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్(Kanpur) లో జరిగింది. కుమారుడిని ప్రేమించిన ఓ యువతి అతడి తండ్రితో వెళ్లిపోయింది. ఈ విచిత్రమైన ప్రేమ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
కాన్పూర్(Kanpur) కు చెందిన 20ఏళ్ల అమిత్ అనే యువకుడి ఓ యువతి ప్రేమించింది. దీంతో తరుచూ అమిత్ ను కలిసేందుకు అతడి ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో యువకుడి తండ్రితో చనువు ఏర్పడి అది కాస్తా ప్రేమకు దారితీసింది. ప్రేమనో లేక మోజునో మరీ ఎక్కువ కావడంతో వారిద్దరు 2022లో ఇంటి నుంచి పారిపోయారు. తమ కూతురు కనపడడం లేదంటూ పోలీసుకు ఫిర్యాదు చేశారు యువతి కుటుంబసభ్యులు. ఏడాది పాటు విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా వీరిద్దరిని ఢిల్లీలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను మాత్రం ఆయనతోనే కలిసి జీవిస్తానని పోలీసులకు తేల్చిచెప్పడంతో వారు ఆ యువతికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
Read Also: మంచిర్యాల జిల్లా మహేష్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
Follow us on: Google News, Koo, Twitter