అల్లుడికి కట్నంగా 21 పాములు – ఇక్కడ ఇదే సంప్రదాయం

21 snakes dowry to Son in Law -This is the tradition here

0
122

అమ్మాయికి పెళ్లి చేసిన సమయంలో కూమార్తెకి కట్న కానుకలు ఇచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వారి ఆర్దిక పరిస్దితి బట్టీ ఈ కట్న కానుకలు ఇవ్వడం జరుగుతుంది. మద్యప్రదేశ్లోని ఓ తెగలో కూతురి పెళ్లిచేస్తే అల్లుడికి 21 విష సర్పాలు వరకట్నంగా ఇవ్వాలట. ఇలాంటిది ఇప్పటి వరకూ ఎక్కడా విని ఉండరు కదా. తాజాగా ఈ వార్త బయటకు వచ్చింది. ఈ సంప్రదాయం ఏమిటో చూద్దాం.

కుమార్తె వివాహం కుదిరిన తర్వాత తండ్రి తన అల్లుడికి బహుమతి ఇవ్వడానికి పాములను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి పాములు పట్టుకుని వాటిని అల్లుడికి ఇవ్వాలి. ఇక ఆ పాములతో ఆకుటుంబాలు ఆడుకుంటాయి.ఇప్పటికీ కుమార్తెకు 21 పాములను కట్నంగా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ తెగ వారు పాములు పట్టుకునే జీవిస్తారు. అందుకే వారు ఈ సంప్రదాయం పాటిస్తున్నారు.

గౌరియా సమాజంలోని ప్రజలు పాముల ద్వారా మాత్రమే డబ్బు సంపాదిస్తారు. గౌరియా సమాజంలో కుమార్తె వివాహం కుదిరాక బాలిక తండ్రి విష పాములను సేకరించడం ప్రారంభిస్తాడు. ఇక వారు ఈ పాములు పట్టుకుని వాటిని అమ్ముతూ జీవిస్తారు. వారు పట్టుకున్న పాము పారిపోయినా, చనిపోయినా కుటుంబంలో ఒకరు దూరం అయినట్టు ఫీల్ వుతారట.