Breaking News- ఎన్ కౌంటర్ లో 26 మంది మావోల హతం

26 Maoists killed in encounter

0
86

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గడ్చరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఏకంగా 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. అంతేకాదు ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్.