హాష్ ఆయిల్(Hash Oil) అమ్ముతున్న ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి మూడు వందల బాటిళ్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నిందితులు 80 వేల రూపాయలకు లీటర్ చొప్పున ఈ ఆయిల్ కొని హైదరాబాద్ తీసుకుని వచ్చినట్టు విచారణలో వెళ్లడయ్యింది. అనంతరం అయిదు, పది మిల్లీ లీటర్ల చొప్పున సీసాల్లో నింపి అమ్ముతున్నట్టు తేలింది. అయిదు మిల్లీ లీటర్ల సీసాను ఎనిమిది వందల రూపాయలకు విక్రయిస్తున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.