488 మంది జ‌ర్న‌లిస్టులు అరెస్టు.. 46 మంది హత్య..వెలుగులోకి సంచలన నిజాలు..

488 journalists arrested .. 46 killed ..!

0
117

జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకులాగే వేటగాడు. ఉరుకుల పరుగుల జీవితంలో, తన చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టిముట్టినా తట్టుకుని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలనే తపనతో ఇంటి నుండి బయటకెళ్తాడు. కనిపించిన ప్రతి దాంట్లో జర్నో కోణాన్ని వెతుక్కుంటాడు. అలా రోజూ కామన్ మ్యాన్ లా ఆలోచించి జర్నీ మొదలు పెడతాడు జర్నలిస్టు.

అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఏడాది 488 మంది జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు చేశారు. సుమారు 46 మందిని హ‌త‌ మార్చిన‌ట్లు రిపోర్ట‌ర్స్ వితౌట్ బోర్డ‌ర్స్‌(ఆర్ఎస్ఎఫ్‌) ఎన్జీవో సంస్థ వెల్ల‌డించింది. గ‌డిచిన 25 ఏళ్ల నుంచి జ‌ర్న‌లిస్టుల డేటాను ఆర్ఎస్ఎఫ్ లెక్కిస్తోంది.

అయితే 2021లో జ‌ర్న‌లిస్టుల మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గిన‌ట్లు ఆ సంస్థ అభిప్రాయ‌ప‌డింది. మిడిల్ ఈస్ట్‌లో వివాదాలు స‌ద్దుమ‌ణ‌గ‌డం వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గిన‌ట్లు భావిస్తున్నారు. కానీ జ‌ర్న‌లిస్టుల అరెస్టులు మాత్రం భారీగా పెరిగాయి. గ‌తంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో అరెస్టుల జ‌ర‌గ‌లేద‌ని త‌న రిపోర్ట్‌లో ఆర్ఎస్ఎఫ్ చెప్పింది. మెక్సికోలో ఏడు, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఆరు మంది జ‌ర్న‌లిస్టులను చంపేశారు. యెమెన్‌, ఇండియాలో న‌లుగురేసి జ‌ర్న‌లిస్టులు హ‌త్య‌కు గుర‌య్యారు.