క్షుద్రపూజల కలకలం..5 రోజులుగా మృతదేహంతో..

0
108

ఉత్తరప్రదేశ్ లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్రాజ్ లోని కర్చన ప్రాంతం దిగా గ్రామానికి చెందిన అంతిమ యాదవ్ ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకి రానియ్యలేదు.

అంతేకాదు ఆమెను బతికించేందుకు ఓ మంత్రికుడితో కలిసి క్షుద్ర పూజలు చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఐదు రోజులుగా మృతదేహం అలానే ఉండడంతో కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దీన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లో జరిగే తతంగం అంతా చూసిన పోలీసులు షాక్ అయ్యారు. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.