మగబిడ్డ కోసం 8 సార్లు అబార్షన్ – భార్యని బ్యాంకాక్ తీసుకువెళ్లి ఏం చేశాడంటే

8 times abortion for a male child

0
86

ఈ రోజుల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే . సమాజంలో ఎంతో గొప్ప గుర్తింపు పేరు ప్రఖ్యాతలు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా తెచ్చుకుంటున్నారు. కానీ ఆడపిల్ల అంటే నేటి సమాజంలో ఇంకా కొంద‌రికి చిన్నచూపే. దేశంలో ఎక్కడో ఒక చోట ఆడపిల్లల పుడితే చంపేయడం గానీ, వదిలేయడం గానీ లేదా కడుపులో ఉండగానే చంపేయడం గానీ చేస్తున్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డవలప్ అయింది ఇంత‌లా పరుగులు పెడుతున్న ఈ సమాజంలో ఇంకా పాత ఆలోచనలతో మూఢనమ్మకాలతో ఉంటున్నారు కొంద‌రు. ముంబైలో తన భార్య మగపిల్లాడినే కనాలని ఓ భర్త ఆమెకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. ఈ వార్త విని అందరూ షాక్ అయ్యారు. ముంబైకి చెందిన ఓ మహిళకు 2007లో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. ఆమె భర్త, అత్త ఇద్దరూ లాయర్లు కాగా ఆడపడుచు ఓ డాక్టర్.

అయితే అత్తమామలు, భర్త తమ వంశాన్ని నిలబెట్టేందుకు మగబిడ్డ కావాలని వివాహం అయిన నాటి నుంచే ఆమెను వేధించడం మొదలుపెట్టారు. 2009లో ఆడపిల్ల పుట్టింది. 2011లో ఆమె మరోసారి గర్భం దాల్చగా ఈసారి ఆమె భర్త ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి లింగనిర్థారణ పరీక్షలు చేయించాడు. అమ్మాయి అని తేలింది ఇలా వరుసగా ఎనిమిది సార్లు అమ్మాయి అని తెలిసి అబార్షన్ చేయించాడు.మగపిల్లాడి కోసం ఆమెకు ఏకంగా 1500 హార్మోనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు
బ్యాంకాక్ కి తీసుకువెళ్లి చేయించాడు. చివరకు ఈ బాధలు భరించలేక ఆమె అతని కుటుంబం పై పోలీసులకి ఫిర్యాదు చేసింది