హైదరాబాద్‌లో నలుగురు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. నిందితులు ద్విచక్రవాహనంపై తిరుగుతూ వరుసగా సెల్‌ఫోన్‌లు లాకెళ్లడంతో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ల దొంగతనాలు జరిగిన వెంటనే తీవ్రంగా పరిగణించి నిందితులను పట్టుకున్నామని డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
ఒక్కరోజులోనే 3 పీఎస్‌ల పరిధిలో దుండగులు సెల్‌ఫోన్‌లు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 9 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. సీసీ కెమెరాల సహాయంతో 48 గంటల్లోనే నిందితులను గుర్తించామని చెప్పారు. బంజారాహిల్స్‌లోని సింగాడికుంటకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశాం. మా పీఎస్ పరిధిలో చోరీకి గురైన 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా గతంలో రాయదుర్గం పరిధిలోనూ 3 సెల్‌ఫోన్ల కేసులో వీళ్లు నిందితులుగా ఉన్నారు.
గోల్కొండ ఠాణా పరిధిలో జరిగిన ఫోన్ దొంగతనం కేసులో సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించామని డీసీపీ వెల్లడించారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లోనే వారిని పట్టుకున్నామని చెప్పారు. బంజారాహిల్స్ సింగాడికుంట బస్తీకి చెందిన మొహమ్మద్ ఖాజా పాషా, మొహమ్మద్ సబెలగ, షేక్ సోహైల్, పవన్ కుమార్‌ను అరెస్టు చేశామని జోయల్ డేవిస్ తెలిపారు.