ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుడు..ఏకంగా  33 మంది మృతి

0
80
Kabul

ఆఫ్ఘనిస్తాన్ పై వరుసగా మూడు రోజులు పాటు ఉగ్రదాడులు దాడికి పాల్పడి ప్రజలను కకాలవికాలం చేసారు. ఇటీవల ఓ స్కూల్, షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో దాడులు జరగడం వల్ల ఎంతో ప్రాణ నష్టం చేకూరింది. తాజాగా మరో శక్తివంతమైన బాంబ్ దాడి మసీదులో ప్రజలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో జరగడంతో ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు.

కుందుజ్ ప్రావిన్సులోని ఇమామ్ సాహెబ్ పట్టణంలో ఈ ఘటన జరిగినట్టు జాబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేసాడు. ఈ ఘటనలో  33 మంది మరణించగా..43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో  పాపం పుణ్యం తెలియని విద్యార్థులే అధికంగా ఉన్నట్టు తెలిసింది.

ఈ ఘటనకు గల కారణం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మైనారిటీలే లక్ష్యంగా తీసుకొని ఇప్పటికే ఎన్నో దాడులు జరిగాయి. కానీ ఇంత ప్రాణ నష్టం జరిగిన తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఐఎస్ కు అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం బాధాకరం.