ఓ చిన్నారి ప్రమాదవశాత్తు 200 అడుగుల బోరు బావిలో పడిపోయింది. ఆ చిన్నారి ఆడుకుంటూ ఇంటి బయట ఉన్న బోరు బావిలో పడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జస్పడ గ్రామంలో జరిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ బాలిక 60 అడుగుల లోతులో ఉన్నట్లు సమాచారం.