Flash: వివాహానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

0
110

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రఘు, నరహరితో పాటు మరో వ్యక్తి  ద్విచక్రవాహనంపై కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లి కాసేపు స్నేహితులతో కలిసి సొంతోషంగా గడిపారు. అనంతరం వేడుక ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఒక్కసారిగా ద్విచక్రవాహనం గేదెల గుంపును ఢీకొనడంతో..ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. అదే వారి చివరి వేడుక కావడం అందరిని కలచి వేస్తుంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.