ఫ్లాష్- ఘోరం..ఇద్దరు పిల్లలను బావిలో పడేసిన తండ్రి

A father who dropped two children in a well

0
119

తెలంగాణలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన భార్యపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూయించాడు. కర్కశంగా మారిన ఆ తండ్రి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..జిల్లాలోని గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ కు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు జాక్సన్‌, జానిబేస్టో ఉన్నారు. రామ్‌కుమార్‌ సీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా ముంబైలో పని చేస్తున్నాడు. రామ్ కుమార్ నాలుగు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. అయితే రామ్‌కుమార్‌ తన భార్య బంగారాన్ని గతేడాది బ్యాంక్‌లో కొదువపెట్టి డబ్బుతీసుకున్నాడు.

తాజాగా, ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. శిరిష తన బంగారాన్ని తీసుకురావాలని భర్తతో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రామ్‌కుమార్‌ భార్యపై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లి బావిలో పడేశాడు. తర్వాత గ్రామంలోకి వెళ్లి తన పిల్లలను బావిలో పడేసినట్లు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వెంటనే బావి దగ్గరకు చేరుకుని, పిల్లలిద్దరిని బయటకు తీశారు. అప్పటికే పిల్లలిద్దరు మృత్యువాత పడ్డారు.