అర్ధరాత్రి ఫైనాన్స్ వ్యాపారిపై కాల్పుల కలకలం..

0
114

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఫైనాన్స్‌ వ్యాపారి సత్యనారాయణరెడ్డిపై దాడి చేసారు. దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.  ప్రస్తుతం ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.