హైదరాబాద్ లో భారీ మోసం..రూ.2 కోట్ల విలువైన ఇల్లు రూ.75 లక్షలకే..కానీ అసలు ట్విస్ట్ తెలిసి ఫ్యూజులు అవుట్!

0
114

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.2 కోట్లు విలువైన ఇంటిని కేవలం రూ.75 లక్షలకు అమ్మేశాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. ఆ ఇల్లున అమ్మింది ఓనర్ కాదు. మరి ఓనర్ కానిది ఆ ఇల్లు ఎలా అమ్మాడు? చివరకు ఇంటి ఓనర్ కు నిజం ఎలా తెలిసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరిపై లుక్కేయండి.

తెల్లపూర్ కు చెందిన సాఫ్ట్ వేర్ సంస్థ నిర్వహకుని తల్లిదండులు హైదరాబాద్ లోని నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. ఇది సుమారు రూ.2 కోట్లు విలువ చేస్తుంది. అయితే ఈ మధ్య విజయ్ తల్లిదండ్రులకు కరోనా రావడంతో వారిని తన ఇంటికి తీసుకెళ్లాడు. నాగనాయక్ అనే వ్యక్తి ఆ ఇంటిపై కన్నేశాడు. ఇదే అదునుగా భావించి నకిలీ పత్రాలు సృష్టించాడు. ఇంకేముంది రూ.2 కోట్లు విలువ చేసే ఇల్లును 75 లక్షలకే బేరం పెట్టాడు. ఈ విషయం తెలియని బత్తుల భాస్కర్ గౌడ్ ఆ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే..

ఇంటి ఓనర్ అయిన విజయ్ ఇంటి ప్రొపెర్టీ టాక్స్ కట్టడానికి జిహెచ్ఎంసి సైట్ లో చూడగా బత్తిని భాస్కర్ గౌడ్ పెరు మీద ఉన్నట్టు చూపించింది. ఖంగుతున్న విజయ్ అందులో ఉన్న నెంబర్ కు ఫోన్ చేశాడు. భాస్కర్ ఫోన్ ఎత్తగా ఆ ఇంటిని నేనె కొనుగోలు చేశానని చెప్పాడు. అతని నుండి నాగనాయక్ నెంబర్ తీసుకొని కాల్ చేయగా ఆ ఇంటిని నేను మీ తల్లి నుండి కొనుగోలు చేశామని చెప్పాడు. ఇక విజయ్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..నాగనాయక్ ను అరెస్ట్ చేశారు.