భార్య చేస్తున్న పనికి విడాకులు కోరుతున్న భర్త – ఇదేం సమస్యరా బాబు

A husband seeking a divorce for the work his wife is doing

0
93

వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్దం చేసుకుని ముందుకు సాగుతారు. అంతేకాదు ఏ ఇబ్బంది వచ్చినా ఇద్దరూ పరిష్కరించుకుంటారు. అయితే ఇటీవల చిన్న చిన్న తగువులకి కూడా విడాకులు తీసుకుంటున్న కొన్ని జంటలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు గురించి వింటే షాక్ అవుతారు. భార్య రోజూ స్నానం చేయడం లేదన్న కారణంతో ఒక భర్త విడాకులు కోరాడు. ఇంతకి ఎక్కడ అనేది చూద్దాం.

ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్లో ఈ ఘ‌ట‌న‌ జరిగింది. క్వార్సీ గ్రామానికి చెందిన మహిళకు, చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక సంతానం. భార్య ప్రవర్తన అతనికి నచ్చడం లేదు రోజూ స్నానం చేయడం లేదట.
చివరకు విసుగు చెందిన భర్త, భార్యకు విడాకులు ఇచ్చేందుకు మూడు సార్లు తలాక్ చెప్పాడు. దీంతో ఆమె పోలీసులని ఆశ్రయించింది.

భార్య విడాకులు ఇవ్వను అని చెబితే, భర్త మాత్రం విడాకుల కోసం పట్టుబడ్డాడు. ఇది చాలా చిన్న సమస్య కావడంతో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు అధికారులు. చివరకు ఈ దంపతులకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.