ములుగులో న్యాయవాది దారుణ హత్య..

0
98

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మల్లారెడ్డి అనే న్యాయ‌వాదిని ఇవ్వాల అనగా సోమవారం సాయంత్రం దాదాపు 7 గంట‌ల ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రానికి దాదాపు 11 కిలోమీట‌ర్ల దూరంలోని పందికుంట బస్టాఫ్ వద్ద జరిగింది. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించగా..ఎర్ర మట్టి క్వారీ… పాత కక్షలే ఈ ఘటనకు కారణమని ప్రాధమికంగా నిర్దారించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.