Crime News: దారుణం..పట్టపగలే న్యాయవాది దారుణ హత్య

0
99

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ న్యాయవాది దారుణ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అరియలూరులోని టీ-పజూర్‌లో బంధువుల వివాహానికి మద్రాసు హైకోర్టు న్యాయవాది స్వామినాథన్‌ హాజరు అయ్యారు. ఈ క్రమంలో మండపం సమీపంలో స్వామినాథన్‌పై ఆరుగురు దుండగులు క్షణాల్లో కత్తిపోట్ల వర్షం కురిపించారు. తీవ్రగాయాలతో స్వామినాథన్‌ అక్కడికక్కడే చనిపోయాడు. కాగా ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.