ఘోరం..యువతిని చంపిన ప్రేమోన్మాది

0
105

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసిని దారుణంగా చంపేశాడో ప్రేమోన్మాది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ లో చోటు చేసుకుందీ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే..మానాజీపేటకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ కు చెందిన యువతితో కొన్ని సంవత్సరాలుగా ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఆ యువతిని మానాజీపేటకు తీసుకొచ్చిన యువకుడు సరదాగా మాట్లాడుకున్నారు. ఇంతలో పెళ్లి ప్రస్తావన రావడంతో యువతి నిరాకరించింది. దీనితో కోపోద్రిక్తుడైన యువకుడు చున్నీతో మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.