దారుణం..భార్యను కత్తితో నాలుగుసార్లు పొడిచి, కూతురి గొంతు కోసిన కామాంధుడు..

0
114

ఈ మధ్య కాలంలో చిన్నచిన్న కారణాల వల్ల కోపంతో క్షణాల్లోనే ప్రాణాలు బలితీసుకోవడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ఇప్పటికే ఈ కామాంధుల దాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా..తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఇలాంటి ఘటన క్షణికావేశంలో ఇద్దరి ప్రాణాల మీదికి తెచ్చింది. వివరాల్లోకి వెళితే..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ ప్రబుద్ధుడు కత్తితో భార్యను, కూతురుని దారుణంగా పొడిచిన ఘటన స్థానికులను బయపబ్రాంతులను చేసింది.

ఇల్లందులో సుల్తాన్​ జేసీబీ డ్రైవర్​గా పనిచేస్తూ ఇంట్లో రోజు గొడవ పెట్టుకునేవాడు. రోజులాగే ఈరోజు కూడా చిన్న వివాదం కాస్త పెద్దగా మారి భార్య జరీనాను కత్తితో నాలుగుసార్లు పొడిచి..కూతురిని గొంతు కోశాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.