కన్న తండ్రి పై రెండవ భార్య కొడుకుల దారుణం.. అందరూ చూస్తుండగానే..

-

Vikarabad |కన్న తండ్రి పై రెండవ భార్య కొడుకులు కర్కశంగా ప్రవర్తించారు. బంధాన్ని మరిచి దారుణంగా హతమార్చారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రోకలిబండతో మోది కిరాతకంగా చంపేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తండ్రి అని కూడా చూడకుండా అంతటి పైశాచికంగా కొడుకులు ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది? నాన్నని చంపాల్సినంత పగ ఆ కొడుకులకు ఏముంది?

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. మృతుడు వెంకటయ్య వికారాబాద్(Vikarabad) జిల్లా కేంద్రంలోని రామయ్యగూడ(Ramaiahguda)లో మొదటి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. రెండవ భార్య కొడుకులు రాము, శ్రీనులు కూడా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా తండ్రి, కొడుకులు మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే గురువారం ఉదయం టీ షాప్ కి వెళ్లేందుకు బయటకు వచ్చిన తండ్రిని కొడుకులు అడ్డగించారు. ఆస్తికోసం తండ్రితో గొడవపడ్డారు. గొడవ పెద్దదవడంతో పెనుగులాటలో తండ్రిని తోసేశారు. కింద పడిన తండ్రిని శ్రీను గట్టిగా పట్టుకున్నాడు. రాము రోకలిబండతో తండ్రిని విచక్షణారహితంగా బాదాడు. తలకి బలమైన గాయం అవడంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ప్రాణం పోయిందని తెలుసుకున్న కొడుకులిద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.

Read Also: కర్ణాటక ఎన్నికలు.. ధర్మపురి అర్వింద్ కి కీలక బాధ్యతలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...