మరదలిపై మోజు : చివరకు ఎంత దారుణం చేశాడంటే..?

0
125

అక్రమ సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి . మరికొందరు వేరే వారిపై మోజుపడి వారు కాదంటే వారిని కూడా అంతం చేస్తున్నారు.మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాగపూర్ లోని పచ్పవోలీలో టైలరింగ్ వ్యాపారం నిర్వహించే అలోక్ మతుకర్ ఏకంగా తన భార్య, పిల్లలు, అత్త, మరదల్ని హత్య చేశాడు . ఇంత దారుణం ఎందుకు చేశాడు అనేది చూస్తే.

అలోక్ మతుకర్ అనే వ్యక్తికి విజయ అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్లకు మతుకర్ మరదలు అమీషా కూడా టైలరింగ్ చేసేది. కొద్ది రోజులకి మరదలిపై కన్నేసిన మతుకర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఎవరితో అయినా మాట్లాడినా తప్పుపట్టేవాడు. ఇక అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మరదలు.

పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. దీంతో మనసులో కోపం పెంచుకున్న అతను. తన కుటుంబ సభ్యులని చంపాల‌ని ఆన్ లైన్ లో కత్తులు ఆర్డర్ చేశాడు. కావాలనే గొడవ పెట్టుకుని విచక్షణ కోల్పోయి, భార్య, అత్త, మరదలిని కత్తితో పొడిచాడు. పిల్లలను బండతో మోది హత్య చేసాడు. తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అతని మామ డ్యూటీ నుంచి వచ్చి చూసే సరికి అందరూ చనిపోయి ఉన్నారు. ఇంట్లో శ్మసాన నిశబ్దం నెలకొన్నది. విగతజీవులై ఉన్న వారి శరీరాలను చూసి ఆయన తల్లడిల్లిపోయాడు.