40 ఏళ్ల పాటు అడవిలో ఉన్న వ్య‌క్తి బ‌య‌టకు వ‌చ్చి ఇలా చ‌నిపోయాడు

A man who has been in the wild for 40 years He came out and died like this

0
73

ఇటీవ‌లే వియత్నాంలో టార్జాన్ అంటూ ఓ వ్య‌క్తి గురించి అంద‌రూ మాట్లాడుకున్నారు. ప్ర‌కృతిలో ఉంటున్నాడు అడ‌విలో హ్యీపీగా ఉన్నాడు అని అంద‌రూ భావించారు. ఇలా 40 ఏళ్ల పాటు అడవిలోనే బతికిన హో వాన్ లాంగ్ అనే వ్యక్తి నాగరిక సమాజంలోకి అడుగుపెట్టడంతో అంద‌రూ అత‌ని గురించి మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. 52 ఏళ్ల వయసులో లివర్ క్యాన్సర్ తో తుదిశ్వాస విడిచాడు.

గ్రామానికి వచ్చిన తర్వాత ఇటీవల లాంగ్ ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్య పరీక్షల్లో అతడు లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. అత‌ను సోమ‌వారం క‌న్నుమూశాడు అనే వార్త తెలిసి అంద‌రూ షాక్ అయ్యారు. అడ‌విలో ఉన్న స‌హ‌జ‌సిద్ద ఆహారం తింటూ సంతోషంగా ఉన్నాడు. కాని ఇప్పుడు శుద్ది చేసిన ఫుడ్ తిని మ‌ద్యం తాగుతూ ఇలా అల‌వాట్లు చేసుకున్నాడు. చివ‌ర‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని లాంగ్ స్నేహితుడు సెరెజో తెలిపాడు.

అడ‌విలో ఉండి ఉంటే ఇంకా బాగుండేవాడేమో అని అత‌ని స్నేహితులు అంటున్నారు. వియత్నాం యుద్ధం సమయంలో లాంగ్ కు రెండేళ్ల వయసు ఉంటుంది. ఇక అత‌ని కుటుంబంలో చాలా మంది చ‌నిపోయారు. అత‌ని తండ్రి లాంగ్ ని తీసుకుని అడ‌విలోకి వెళ్లిపోయాడు. అక్క‌డే ఇలా దొరికింది తింటూ బ‌తికారు. 2013లో వీరిని గుర్తించారు అధికారులు.