హైదరాబాద్: మెట్రో స్టేషన్‌ నుంచి దూకిన వ్యక్తి మృతి

A man who jumped from a metro station has died

0
81

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కువకొండకు చెందిన భీమా జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చాడు. భీమా గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి పలు మెట్రో స్టేషన్ల వద్ద తిరుగుతుండేవాడు.

గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకున్న అతను అక్కడి మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. రాజీవ్‌ చౌక్‌ వద్ద పికెట్‌ విధుల్లో ఉన్న పోలీసులు 108 వాహనంలో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం భీమా మృతి చెందాడు.